Ayurveda
A Guide to Balanced Living and Optimal Health
Discover tips, resources, and insights on achieving balance through natural health practices. Empower yourself with knowledge to live a healthier, more harmonious life.
ఆయుర్వేదం
ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే, ముందు చరిత్రలో ఏమి జరిగిందో తెలుసుకోవాలి. ప్రపంచంలో భారతదేశానికి ఉన్న వాతావరణ, భూగోళ స్థితులు ఏ ఇతర దేశానికీ లేవు. మన దేశానికి 70% నుండి 80% వరకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా, ఇతర దేశాలకు కేవలం 30% నుండి 40% మాత్రమే ఉన్నాయి. ఇటువంటి అనుకూల వాతావరణంలో, భారతదేశ ప్రజలకు ఆయుర్వేదం కృతయుగం నుండి కలియుగం వరకు విలువైన వైద్య సేవలను అందిస్తూ, ఆరోగ్య పరిరక్షణలో ఎంతో విశిష్ట స్థానం సంపాదించుకుంది.
అయితే, ఈనాటికి ఈ మహోన్నత ఆయుర్వేదం తన వైభవాన్ని ఎందుకు కోల్పోయింది అనేది పరిశీలించాలి. ఒకసారి చరిత్రను పరిశీలిద్దాం. ముందుగా, కృత, త్రేతాయుగాలను పక్కనపెట్టి, మూడవ యుగమైన ద్వాపర యుగాన్ని పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు 5255 సంవత్సరాల క్రితం, 18-7-3228 BCE లో జన్మించినాడు. ఆయన 125 సంవత్సరాలు 8 నెలలు 7 రోజులు భూమి మీద జీవించి, ద్వాపర యుగం ముగిసిన తర్వాత పకృతిలో ఐక్యమయ్యారు. ఆ ద్వాపర యుగంలో కూడా ఆయుర్వేద వైద్యం ద్వారా ఆరోగ్య పరిరక్షణ జరిగింది.
తరువాత కలియుగంలో చరక మహాముని ఆయుర్వేదాన్ని భారతదేశానికి మరింతగా పరిచయం చేశారు. వారి శిష్యుడు వాగ్భట ఆచార్యులు 135 సంవత్సరాలపాటు బ్రహ్మచారిగా జీవించి, గురువుల వద్ద విద్యాభ్యాసం చేసి, తన శరీరాన్ని ప్రయోగశాలగా మార్చి ఆయుర్వేదంపై అధ్యయనం చేశారు. ఆయన 7,000 ఆరోగ్య సూత్రాలను రచించి, అష్టాంగ హృదయము మరియు అష్టాంగ సంగ్రహము అనే రెండు గొప్ప గ్రంథాలను సంస్కృతంలో రచించి, భారతావనికి క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల క్రితం అందించారు. అప్పటి నుండి భారత ప్రజలకు రోగ బాధల నుండి ఉపశమనంగా ఆయుర్వేదం అద్భుత సేవలందిస్తూ వచ్చింది.
కాని, 1608లో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి, వ్యాపారానికంటే ఎక్కువగా పాలనాధికారాన్ని చేపట్టి, భారత ప్రజలను ఆయుర్వేదం నుండి దూరం చేస్తూ, అల్లోపతి (ఇంగ్లీష్) వైద్యాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఆయుర్వేదం తన వైభవాన్ని కోల్పోయి, అల్లోపతి వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది. నిజం చెప్పాలంటే, అల్లోపతి వైద్యంలో చాలా రోగాలకు మందులు లేవు, మరియు వాటి ప్రభావం శరీరంపై రోగాలను తాత్కాలికంగా తగ్గించినా, ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. అయితే, ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి ఉంది.
మన దేశవాళీ " వరి " రకాలు వాటి ప్రాముఖ్యత
మన భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, వరి ధాన్యాలు ప్రధాన ఆహారపు పంటలు. భగవంతుడు మనుషుల కన్నా ముందుగానే ఆరు లక్షల రకాల వరి ధాన్యాలను ఈ భూమిపై సృష్టించాడు. మానవులు పుట్టిన నాటి నుంచి మరణించే వరకు వివిధ దశల్లో ఆరోగ్య పరిరక్షణ కోసం ఔషధ విలువలతో కూడిన ఈ వరి ధాన్యాలను భగవంతుడు ప్రసాదించినారు. కానీ, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, విదేశీయుల యుద్ధాల వలన, వాటిలో చాలావరకు అంతరించిపోయాయి. ప్రస్తుతం, ఐదు వేల రకాల వరి ధాన్యాలు మాత్రమే భూమిపై మిగిలి ఉన్నాయి.
స్వాతంత్ర్యానంతరం ఆహార అవసరాల నిమిత్తం, అధిక దిగుబడుల కోసం, వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు జన్యు మార్పులు చేసి హైబ్రిడ్ వరి వంగడాలను కనుగొని సాగులోకి తీసుకువచ్చారు. ఈ హైబ్రిడీకరణ వల్ల ధాన్యాలలోని ఔషధ విలువలు కోల్పోయి, మామూలు ధాన్యాలుగా మారిపోయాయి. అయితే, భగవంతుడు సృష్టించిన దేశీయ వరి రకాలలో ప్రతి రకానికీ ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. హైబ్రిడ్ వరి రకాలలో ఔషధ గుణాలు లేకపోగా, వాటిని సాగు చేసే పద్ధతుల్లో ఎరువులు, విష రసాయనాలు వాడడం వలన అవి ఆహార ధాన్యాలలో ఉన్న అవశేషాలు మన ఆరోగ్యానికి హానికరం అవుతున్నాయి.
భగవంతుడు సృష్టించిన దేశీయ వరి రకాలను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించడం వలన, మన శరీరానికి ఎన్నో రకాల ఔషధ గుణాలు అందుతాయి. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ధాన్యాలలో ఏ రకంలో ఏ ఔషధ గుణం ఉందో క్రింద వివరించబడింది.
ప్రకృతి సేద్యానికి విశేష సేవలు అందించిన శ్రీ శ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు అభినందనీయులు. వారి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2016లో వారికి పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది
గోవుకు (ఆవు) భారతీయ వ్యవసాయంలో మరియు సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆవు నుంచి లభించే పంచగవ్యాలు (పాలు, పెరుగు, వెన్న, మూత్రం, పేడ) పర్యావరణహితమైనవిగా, ఆరోగ్యానికి మంచివిగా భావించబడతాయి. గోమూత్రం, గోమయం వంటి ఉత్పత్తులు సాగులో ఎరువులుగా ఉపయోగపడతాయి, ఇది నేల రసాయనాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆవు ఆధారిత వ్యవసాయ పద్ధతులు సుస్థిరతకు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి.
మన దేశవాళీ " వరి " రకాలు వాటి ప్రాముఖ్యత
1. రక్త శాలి
ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.
అత్యంత పోషక విలువలు, ఔషధ మూలికా విలువలు కలిగినది.
ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ రైస్ను ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లోమోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.
2. కర్పూకవుని:
ఈ రైసు నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారముకొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.
3. కుళ్లాకార్:
ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ ఆహార పంట బియ్యం.
4. పుంగార్:
ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది మరియు ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది,శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది.ఇది100% మహిళలకు మంచిది.
5. మైసూర్ మల్లిగా:
ఈ రైసు తెలుపు రంగులో ఉంటుంది.ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు,ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.పిల్లలకు మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.
6. కుజిపాటలియా,సన్నజాజులు,చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు:
ఇవి తెలుపు,సన్న రకాలు.ఈ బియ్యంలో కొవ్వు రహిత మరియు సోడియం లేనివి.
తక్కువ కేలరీలు కలిగి వుంటాయి, గ్లూకోజ్ పదార్థంలు తక్కువగా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరగడానికి తోడ్పడతాయి.
7. రత్నచోడి:
ఈ రైసు తెలుపు, సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి.
కండపుష్టికి మరియు శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది.
శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడే వారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
8. బహురూపి, గురుమట్టియా, వెదురు సన్నాలు :
తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు, పీచు పదార్థంలు కలిగి ఉంటాయి.
కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి.
మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి.
బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.
రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతాయి.
9. నారాయణ కామిని:
ఈ రైసు తెలుపు, సన్న రకము .
ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.
మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
10 ఘని:
ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం.
అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ.
శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.
వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.
చేను పై గాలికి పడిపోదు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
11. ఇంద్రాణి:
ఈ రైసు తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము.
కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.
పెద్దవాళ్లు కూడా తినవచ్చు.
గుల్ల భారిన (బోలు) ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది,
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
12. ఇల్లపు సాంబ :
ఈ రైసు తెలుపు, సన్నరకం.
ఇది మైగ్రేన్ సమస్యలను, సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
13. చిట్టి ముత్యాలు:
ఈ రైసు తెలుపు, చిన్న గింజ రకం, కొంచెం సువాసన కలిగి ఉంటుంది.
ప్రసాదంలకు, పులిహారమునకు, బిర్యానీలకు చాలా బాగుంటుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
14. దేశీ బాసుమతి:
ఈ రైసు తెలుపు, పొడవు రకము, సువాసన కలిగి ఉంటుంది.
ఇది బిర్యానీలకు అనుకూలంగా ఉంటుంది.
15 కాలాజీరా:
ఈ రైస్ తెలుపు రంగులో ఉంటుంది.
ఇది సువాసన కలిగిన బేబీ బాస్మతి రైస్.
ఇది బిర్యానీలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
16. పరిమళ సన్నము, రాంజీరా, రధునీ పాగల్, గంధసాలె, తులసీబాసో, బాస్ బోగ్,కామిని బొగ్:
ఇవన్నీ తెలుపు రకము.
సుగంధ భరితమైన బియ్యం.
ఇవి ప్రసాదంలకు, పులిహారములకు, పాయసములకు చాలా బాగుంటాయి.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
17. దూదేశ్వర్, అంబేమెహర్ (scented వెరైటీ ):
ఈ రైసు తెలుపు, బాలింతల స్త్రీలకు పాలు పెరగడానికి తోడ్పడుతాయి.
తద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తల్లి పిల్లలకు అధిక పోషకాలు అందుతాయి,
తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.
18 కుంకుమసాలి:
ఈ రైసు తెలుపు, రక్త ప్రసరణ మెరుగుపరచడానికి,
మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
19 చికిలా కోయిలా:
ఈ రైసు తెలుపు, సన్న రకము, దీని వల్ల లాభం కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, ప్రతీ రోజు కిడ్నీ డయాలసిస్ వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
కిడ్నీకి సంబంధించిన సమస్యల నుండి ఇబ్బంది పడకుండా సహాయపడుతుంది.
20 మడమురంగి:
ఈ రైసు ఎరుపు, లావు రకము.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, జింక్, కాల్షియం ఉంటాయి.
వర్షాకాలంలో అడుగు పైన ముంపును కూడ తట్టుకునే రకము.
మంచి దిగుబడిని కూడా ఇస్తుంది.
ఇది తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు.
21 కెంపు సన్నాలు:
ఈ రైసు ఎరుపు, సన్నరకం, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, జింక్, ఐరన్, అధిక పోషకాలు ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
22 కాలాబట్టి, కాలాబట్, బర్మా బ్లాక్, మణిపూర్ బ్లాక్:
ఇవి నలుపు రంగులో ఉంటాయి.
ఇవి అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కలిగినవి.
ఈ రైస్ వలన కలిగే లాభాలు, క్యాన్సర్ మరియు డయాబెటిస్, గుండె జబ్బుల వంటి అనారోగ్యాల బారిన నుండి రక్షణ కల్పిస్తుంది.
ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
ఈ బియ్యంలో విటమిన్ బి,ఇ,నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు, పీచు పదార్ధాలు అధికము.
ఈ బియ్యంలో ఆంకోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడమే గాక రోగనిరోధక ఎంజైములను క్రియాశీలకము చేస్తుంది. .
23 పంచరత్న:
ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది,
ఇది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది.
అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.ఇది కూడా వండర్పుల్ రైస్.
24 మా పిళ్లేసాంబ:
ఈ రైసు ఎర్రగా ఉంటుంది.
గర్భాధారణ సమస్యలతో బాధపడుతున్న దంపతులకు చాలా ఉపయోగం.
రోజు ఇరువురు కనీసం 5నుండి6 నెలల వరకు తిన్నచో గర్భాధారణ జరుగును.
ఇది ప్రాక్టికల్గా నిరూపించబడినది.
దీనివలన కండ పుష్టి, దాతు పుష్టి ,వీర్య పుష్టి కలుగును.
ఇమ్యూనిటీపవర్ కూడా పెరుగును.
25 నవార:
ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.
ఇది కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.
ఈ విత్తనం త్రేతాయుగము నాటిది.
షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది.
మరియు మోకాళ్ళు,మోచేతి కీళ్ళ నొప్పులు,నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.
కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యంను వండి బాడీ మసాజ్ లో వాడుతారు పక్షపాతం ఉన్నవారికి.
ఈ రైస్ను ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు.
ఇది అన్ని వయసుల వారూ తినవచ్చును.
ఒక పూట మాత్రమే తినవలెను.
ఈ రైస్ యొక్క ప్రత్యేకత బియ్యం నుండి కూడా మొలకలు వచ్చును.
26 రాజముడి:
ఈ రైస్ తెలుపు ఎరుపు కలిగి ఉంటుంది.
దీనిని ప్రాచీన కాలంలో మైసూర్ మహారాజుల కోసం ప్రత్యేకముగా పండించిన బియ్యముల్లో ఇది ఒకటి.
దీనికి ప్రత్యేకస్థానం ఉంది.
ఈ రైస్లో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ , జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి.
అందువలన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు ప్రీరాడికల్స్ నుండి నిరోధిస్తుంది.
శరీరము అశ్వస్థత నుండి కోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
చర్మం యొక్క ఆకృతిని పెంచడానికి సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
- స్వస్తీ...
The Power of Nature: Guide to Wellness and Vitality
Explore the healing power of the natural world for a healthier life. From essential oils to meditation, discover wellness techniques rooted in nature. Restore energy, reduce stress, and enhance overall vitality. Let nature guide your path to wellness.